ఈరోజుల్లో ఇళ్లు కట్టడం అంటే..లక్షలు కాదు..కోట్లు ఖర్చుచేయాల్సి వస్తుంది. సాధారణంగా అయితే లక్షల్లో అవుతుంది. కానీ లగ్జరీ హౌస్ కావాలంటే మాత్రం కోట్లు పెట్టాల్సిందే.. అంత ఖర్చు పెట్టి కట్టిన ఇళ్లు కూడా కొన్నేళ్లకు రోడ్డు వెడల్పులోనే, రోడ్డులెవల్ పెంచడం వల్లనో డౌన్ అయిపోతుంది. స్థలానికి ఉన్న డిమాండ్‌ను బట్టి భూమిరేట్లు అనేవి మారతాయి.. అందుకే ఊర్లల్లో ఒకరేటు ఉంటుంది.. సిటీల్లో ఒక రేటు ఉంటుంది. మీరు తక్కువ బడ్జెట్‌లోనే లగ్జీరి ఇళ్లు కడితే.. పైగా అది మీతోపాటు ఎటుకావాలంటే అటు తిప్పుకునే వీలుంటే.. ఆహా ఆ ఊహ ఎంత బాగుందో కదా..! ఇది ఊహ కాదండీ.. నిజం..! బిజినెస్‌మెన్ ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశారు..
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఆనంద్ మహీంద్ర రీసెంట్‌గా 40లక్షలకే అద్భుతమైన సౌకర్యాలతో డిజైన్డ్ ఫోల్డబుల్ హౌస్ (Foldable house)వీడియోని తన ట్విట్టర్ ఖాతా ద్వారా అందరికి షేర్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో చూసి ..ఇలాంటి ఇళ్లు ఎవరు నిర్మిస్తున్నారు..? అవి ఎంత స్ట్రాంగ్‌గా ఉంటాయి ..? ఎక్కడ దొరుకుతాయని సెర్చ్ చేస్తున్నారు.
కేవలం 40లక్షల ఖరీదుతో 500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఇల్లు డిజైన్ చేశారు. ఒక బెడ్రూం, హాలు, కిచెన్‌తో పాటు బాత్రూం, వాష్‌రూం అన్నింటిని ఇందులో సెట్ చేశారు. లాస్‌వేగస్‌లోని బాక్సైల్ అనే ఓ సంస్థ ఈ తరహా ఫోల్డబుల్ హౌస్‌ని తయారు చేస్తోంది.
ఎక్కడికైనా తీసుకెళ్లెచ్చు..
ఈ మడత పెట్టి తీసుకెళ్లే ఇంటి వీడియోని చూసి ఆనంద్ మహీంద్ర ఆశ్చర్యానికి గురయ్యారు. ఇండియాలో ఇలాంటి ఇళ్లు ఇంకా తక్కువ ధరకే తయారు చేయవచ్చు అని తెలిపారు..విపత్తులు సంభవించిన తర్వాత పునరావాస కేంద్రాల తరహాలోనే ఇలాంటి వాటిని నిర్మిస్తే ఇలాంటి ఇళ్లు ఎంతో సౌకర్యవంతంగా ఉంటాయని అందరికి యోగ్యంగా ఉంటుందని రాసుకొచ్చారు..
ప్రస్తుతం ఇలాంటి ఇళ్లు కేవలం అమెరికా వంటి అగ్రదేశాల్లోనే అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ ఫోల్డబుల్ హౌస్ నిర్మాణం, వివరాల కోసం మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు https://www.boxabl.com/పోర్టల్‌లో ఓపెన్ చేసి చూస్తే అర్ధమవుతుంది. వీటి నిర్మాణం కోసం ఎలాంటి మెటీరియల్స్ వాడుతున్నారో కూడా అర్ధమవుతుంది. గతంలో ఇలాంటిదే ఓ ఇంటిని మన తెలుగు అమ్మాయి తయారు చేసింది.. అయితే అది మడిచిపెట్టలేం కానీ..పైప్‌లైన్‌లోనే దిమ్మతిరిగిపోయే ఇళ్లు కట్టింది ఆ యువతి.. ఇంకా ఆ ఇంటికి ఖర్చు కూడా 3-5 లక్షల వరకూ మాత్రమే అవుతుంది.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి ఇళ్లు క్లిక్ అయితే జనాలకు చాలా డబ్బులు మిగులుతాయి.. చాలామంది ఎక్కువగా ఇంటిమీదే పెట్టుపడి పెడతారు.. ఉండేది సిటీల్లో కానీ ఊర్లో ఇళ్లు కావాలి.. అక్కడ ఎవరూ ఉండరూ.. ఏదో మనకంటూ ఓ ఇళ్లు ఉంది అన్నపేరుకు.. అలాంటి వారికి ఇలాంటి మినీ హౌస్‌లు బాగా ఉపయోగపడతాయి..