మనం రోజు లాగే బ్రష్ చేస్తున్నప్పుడు సడన్ గా చిగుళ్ల నుండి రక్తం కారుతూ ఉంటుంది. దీనికి కారణం నోటిలో ఉండే బాక్టీరియా వల్ల చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి రక్తం కారడం వంటివి జరుగుతాయి. చిగుళ్ల మద్య నుండి రక్తం కారడం, చిగుళ్లు వదులవడం, నోరు బంక బంకగా ఉండటం, నోటి దుర్వాసన వంటివి చిగుళ్ల వ్యాధి లక్షణాలు.
చిగుళ్లు వదులైతే పళ్ళ మద్య సందులు రావడం, ఏదైనా తిన్నప్పుడు ఆ సందుల్లో ఇరుక్కుపోవడం వల్ల సమస్య మరింత పెరుగుతుంది. డాక్టర్ దగ్గరకు వెళితే కొన్ని యాంటి బయాటిక్స్ ని ఇస్తారు. కాని డాక్టర్ దగ్గరకు వెళ్ళే ముందు కొన్ని ఇంటి చిట్కాలు పాటిస్తే కొంత వరకు ఉపసమనం పొందవచ్చు.
ఉప్పు నీటి తో తరచుగా పుక్కిలి పట్టాలి. క్యారెట్, బీట్ రూట్ వంటి పచ్చి కూరగాయలు వంటి వాటిని నమలడం వల్ల నోట్లో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. తమల పాకు కిళ్ళి వల్ల నోటి దుర్వాసన నివారించబడుతుంది.అల్లాన్నిబాగా కాల్చి కొద్దిగా ఉప్పు చేర్చి పళ్ళపొడి గా ఉపయోగిస్తే చిగుళ్లు మరియు దంతాల పోటు తగ్గుతుంది. భోజనం తరువాత రోజు ఒక లవంగం లేదా చిన్న దాల్చిన చెక్క ని చప్పరిస్తే నోటి దుర్వాసన రాదు.