మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. పుష్పక్ ఎక్స్ ప్రెస్ లో మంటలు చెలరేగాయి. దీంతో రైలులో ఉన్న ప్రయాణికులు అందులోంచి ట్రాక్ పైకి దూకారు. దీంతో వెనుక నుంచి వచ్చిన బెంగళూరు ఎక్స్ ప్రెస్ ప్రయాణికులను ఢీ కొట్టడంతో అక్కడికక్కడే ఆరుగురు మరణించారు.
ఇక మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. పుష్పక్ ఎక్స్ ప్రెస్ లో చైన్ లాగడంతో మంటలు అంటుున్నాయని ప్రయాణికులు పేర్కొన్నట్టు సమాచారం. మహారాష్ట్రలోని బలగావ్ రైల్వే స్టేషన్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.