వైసీపీకి షాక్.. టీడీపీలో చేరిన నలుగురు కౌన్సిలర్లు..!

-

పల్నాడు జిల్లా వినుకొండ లో వైసీపీ కి షాక్ తగిలింది. నలుగురు కౌన్సిలర్లు  పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం టీడీపీ లో చేరారు. ఈ సందర్భంగా పసుపు కండువాలు  కప్పి నలుగురు కౌన్సిర్లను
ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు  పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ బలోపేతం కోసం పని చేయాలని టీడీపీలో చేరిన నలుగురు కౌన్సిలర్లకు ఆయన సూచించారు.

ఈ సందర్భంగా జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ వినుకొండ నియోజకవర్గం అభివృద్ధి కోసం పార్టీల-
కతీతంగా పని చేయాలన్నారు. గత ఏళ్ల పాలనలో గుట్కా, గంజాయి రౌడీయిజం తప్ప చేసిందేమి లేదని విమర్శించారు. అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీలో చేరతామంటే ఎవరినైనా సరే తీసుకుంటామని జీవీ ఆంజనేయులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news