ఈ చిట్కాలు పాటిస్తే తెల్లని ప్రకాశవంతమైన చర్మం మీ సొంతం..!

-

అందం కోసం ప్రతీ ఒక్కరు శ్రద్ధ తీసుకుంటూనే ఉంటారు. అయితే తెల్లగా ప్రకాశవంతమైన చర్మం మీ సొంతం చేసుకోవాలంటే ఈ సింపుల్ టిప్స్ ని ఫాలో అవ్వండి. దీనితో మీ చర్మం తెల్లగా ప్రకాశవంతంగా మారుతుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. అలానే ఖర్చు కూడా తక్కువ. ఇక అసలు విషయం లోకి వస్తే… నలుపు ను పోగొట్టి చర్మం ఛాయను పెంచడానికి బంగాళదుంప బాగా పని చేస్తుంది. బ్లీచింగ్ ఏజెంట్స్ బంగాళదుంప లో పుష్కలంగా ఉండడం వలన నలుపుని పోగొడుతుంది.

బంగాళదుంప ను పేస్ట్ చేసి అందులో కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖానికి ప్యాక్ లా వెయ్యాలి. ఆ తర్వాత చల్లటి నీటితో వాష్ చేసేసుకోవాలి. ఈ పద్దతిని నెలకి మూడు సార్లు చేస్తే మార్పు మీకే కనపడుతుంది. నలుపును తగ్గించడం తో పాటు ముఖం మీద ఏర్పడ్డ మచ్చలను తొలగించడానికి కలబంద సహాయ పడుతుంది. కలబంద గుజ్జుని ప్రతీ రోజు నిద్ర పోయే ముందు రాసుకుని ఉదయం కడిగేస్తే నలుపు తగ్గుతుంది, మచ్చలు కూడా పోతాయి.

ట్యాన్ పోయి తెల్లగా రావాలంటే కాటన్ బాల్స్ తీసుకుని పాలలో ముంచి , ముఖం అంతా శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల తెల్లగా మారుతుంది మీ స్కిన్ టోన్. ఆరెంజ్ తొక్కను ఎండబెట్టి పొడి చేసి, ఆ పొడికి కొంచెం పాలుకలిపి మెత్తని పేస్ట్ లా తయారు చేసుకుని ముఖం పై వీలుని బట్టి ఫేస్ ప్యాక్ వేసుకుంటే కూడా తెల్లగా మారొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version