కరోనా హవా…అన్ని వ్యాపారాలకు కరోనా పేరే

-

వ్యాపారం చేయడానికి వ్యాపారాలు ఎంతగా తెలివిమీరి పోతున్నారో ఈ ఉదంతం గురించి తెలుస్తే అర్ధం అవుతుంది. కరోనా వైరస్ గురించి ప్రపంచానికి తెలియగానే వెంటనే మాస్కులు,శానిటైజర్ల అమ్మకాలకు రెక్కలు వచ్చాయి. మొత్తానికి ఈ మహమ్మారి కారణంగా ఎందరో ప్రాణాలు కోల్పోతుంటే వ్యాపారులు మాత్రం ఈ కరోనా పేరును వాడుకొని డబ్బులు సంపాదించేపనిలో పడ్డారు. ఈ క్రమంలో తమ వ్యాపారాలకు కరోనా అని పేర్లు కూడా పెట్టేసుకుంటూ వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. తాజాగా తెలుగు రాష్ట్రాల్లోని ఒక చెప్పులు దుకాణానికి “కరోనా” అని పేరు పెట్టడం గమనార్హం. ఆ దుకాణం పేరు చూడగానే ప్రజలు తొలుత ఆశ్చర్యపోయినా.. ఆ తర్వాత నవ్వుకొని ఆ చెప్పుల షాపుకు వెళుతున్నారట. అయితే ఇంతకీ ఈ చెప్పుల షాపు ఎక్కడ ఉందొ తెలుసా రాజమండ్రి లో. ఈ విషయం పై సోషల్ మీడియాలో పెద్ద ప్రచారం జరుగుతోంది. అయితే, ముంబయికి చెందిన ఓ సంస్థ పరుపులను అమ్ముకోవడానికి కూడా ఈ కరోనా వైరస్ పేరును వాడుకుంటున్నారు. తమ పరుపులు ‘యాంటీ కరోనా వైరస్ మ్యాట్రెస్’ అంటూ పేపర్లో ప్రకటించింది. వాటిని వాడితే కరోనా రాదాని పేర్కొంది. ‘బోంబే సమాచార్’ పత్రికలోని ఈ ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

దీంతో నెటిజనులు ఈ సంస్థను ఓ ఆట ఆడేసుకుంటున్నారు. కరోనా వైరస్‌కు కనీసం మందు కూడా అందుబాటులోకి రాలేదు. అలాంటి మీ పరుపులు ఆ వైరస్‌ను ఎలా అడ్డుకుంటాయని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ప్రజలను మోసం చేస్తూ.. వైరస్‌ను సొమ్ము చేసుకోవద్దని అంటున్నారు. అయితే జనాలను మోసం చేస్తున్న ఆ సంస్థపై కొందరు పోలీసులకు ఫిర్యాదు కూడా చేసినట్లు తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news