బలవంతపు సెక్స్ తప్పే కాదు ; కోర్టు సంచలన తీర్పు

-

ముంబై అడిషనల్‌ సెషన్స్‌ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ముంబైలో ఒక మహిళ తన భర్త తనతో బలవంతంగా లైంగిక సంబంధం పెట్టుకున్నాడని, దాని ఫలితంగా ఆమె పక్షవాతం వచ్చిందని ఆరోపించింది. అయితే, ఈ కేసులో ముంబై అడిషనల్‌ సెషన్స్‌ కోర్టు వివాదస్పద తీర్పు ఇచ్చింది. బలవంతంగా లైంగిక సంబంధం చట్టవిరుద్ధమైన చర్య కాదని పేర్కొన్న కోర్టు.. నిందితుడికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసు వివరాల్లోకి వెళితే.. ముంబై సమీపంలోని మహాబలేశ్వర్‌ కు చెందిన ఓ మహిళకు మరో వ్యక్తికి గత ఏడాది నవంబర్‌ 22 న వివాహం అయింది.

అయితే.. పెళ్లి జరిగినప్ప నుంచి ఆ మహిళను.. ఆమె భర్తతో సహా కుటుంబ సభ్యులు హింసిస్తున్నారు. అదనపు కట్నం తీసుకు రావాలని టార్చర్‌ కు దిగారు. అంతేకాదు.. ఇష్టం లేకుండా బలవంతంగా ఆ మహిళతో పలమార్లు సెక్స్ చేశాడు. దీంతో ఆ మహిళకు నడుము కింది భాగం లో పక్షవాతం వచ్చింది. దీంతో తన భర్త తో సహా ఆ కుటుంబంపై కేసు పెట్టింది ఆ మహిళ. అయితే.. ఈ కేసును తాజాగా ముంబై అడిషనల్‌ సెషన్స్‌ కోర్టు విచారించింది. భార్యభర్తల మధ్య బలవంతపు సెక్స్‌ చట్టవిరుద్ధం కాదని ఈ సందర్భంగా ముంబై అడిషనల్‌ సెషన్స్‌ కోర్టు స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version