కాలం మారుతున్న కొద్దీ.. మనుషుల వేషదారన కూడా పూర్తీగా మారింది. ఒకప్పుడు మగవాళ్ళు పంచె,ఆడవాళ్ళు చీరలు మాత్రమే వేసుకొనేవాల్లు..కానీ ఇప్పుడు ఛీ అనుకున్న వాటినే ఫ్యాషన్ అంటున్నారు. సాధారణంగా అబ్బాయిల కోసం ఓ రకమైన దుస్తులు, అమ్మాయిల కోసం ఓ రకమైన దుస్తులంటూ డిజైన్ చేశారు.ట్రెండ్ మారుతుండటంతో అమ్మాయిలు కూడా ఫ్యాంటు, షర్టులు వేసుకోవడం ఫ్యాషన్ అయింది. అయితే వారి కోసం ఆ దుస్తులు ప్రత్యేకంగా తయారవుతాయి. కాని మహిళలు కట్టుకునే చీరలు.. అబ్బాయిలు కట్టుకునే ఫ్యాషన్ ఇంకా రాలేదు. ఏదో సరదాగా కట్టుకున్న.. అబ్బాయిలు చీరలు కట్టుకుని బయట తిరిగితే నవ్వుతారు.. కానీ అమెరికాలో మాత్రం ఇద్దరు అబ్బాయిలు ఓ ఇండియన్ పెళ్లికి వెళ్తూ.. చీరలు కట్టుకున్నారు. ఇప్పుడు ఈ పోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
కాలం మారుతున్న కొద్దీ ఫ్యాషన్లో కొత్త ట్రెండ్ వస్తోంది. చికాగోలో జరిగిన తమ భారతీయ స్నేహితుడి పెళ్లిలో ఇద్దరు పురుషులు చీరలు ధరించి కనిపించారు. ఆడవాళ్లు జీన్స్, టీ షర్ట్ ధరించినట్లు తెలుస్తుంది.చీరలొ వారిని చూసి ఫ్రెండ్ షాక్ అయ్యాడు.అంతేకాదు వీరిద్దరూ చీరలో వాక్ చేస్తూ.. అందరిని ఆశ్చర్యపరిచారు. ఇన్ని రోజులు మహిళలు మాత్రమే చీర కట్టుకోవాలి అనే పద్దతిని ఈ ఇద్దరు స్నేహితులు మార్చేశారు.
ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది..ఈ వీడియోలో ఇద్దరు అబ్బాయిలు తమ స్నేహితుడి వివాహానికి రెడీ అవుతూ ఉంటారు. అయితే.. వీరిద్దరూ చీర కట్టుకునేందుకు ఓ మహిళ సహాయం చేస్తుంది. పెళ్లికి వెళ్లేందుకు రెడీ అయిన వీరిద్దరూ… చికాగోలోని మిచిగాన్ అవెన్యూలో రంగురంగుల చీరలు ధరించి అందంగా నడుచుకుంటూ హొయలు ఒలికించారు.వాళ్ల స్టైల్ చూసి అక్కడున్న వారంతా ఫ్లాట్ అయ్యారు. నుదుటి పై బొట్టు పెట్టుకుని అచ్చం అమ్మాయిలా రెడీ అయ్యారు. వధూవరులు ఇద్దరూ వీరిని చూసి తెగ నవ్వుకున్నారు. ముగ్గురూ ఒకరినొకరు కౌగిలించుకుని నవ్వుకున్నారు. ఇక అబ్బాయిలు చీరలు కట్టుకోవడం కూడా ఫ్యాషన్ కాబోతుందా అంటూ కామెంట్లు చేస్తున్నారు… మొత్తానికి చీరలొ చాలా అందంగా ఉన్నారు..