బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ను తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. తన తల్లి మరణించడంతో అంత్యక్రియల కోసం దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఆయన్ను శంషాబాద్ ఎయిర్ పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
అనంతరం ఆయన రిక్వెస్టు మేరకు తన తల్లి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు పోలీసులు అనుమతిని ఇచ్చారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత షకీల్‌ను అరెస్టు చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా, తన కొడుకు కార్ యాక్సిడెంట్ చేసి ఇద్దరి మరణానికి కారణమైన విషయం తెలిసిందే. అతన్ని తప్పించేందుకు డ్రైవర్‌ను ఈ కేసులో ఇరికించి కొడుకును దొంగతనంగా దుబాయ్ పంపించినట్లు పోలీసులు నిర్దారించారు. ఈ కేసులో సాక్ష్యాన్ని తారుమారు చేయడానికి ప్రయత్నించిన కేసులో పోలీసులు అరెస్టు చేసేందుకు సిద్ధమయ్యారు.