యాసంగి పంటలు కోతకు వచ్చిన సమయంలో అకాల వర్షాలు రైతులకు కన్నీళ్లు మిగిలిస్తున్నాయి.ఇవాళ రేపో అయితే ధాన్యాన్ని అమ్ముకుని పంట డబ్బులు వస్తాయని అనుకునేలోపే అకాల వర్షాలు రైతులకు తీరని గోసను మిగిలుస్తున్నాయి.
తాజాగా ములుగు జిల్లా మంగపేట మండలంలో ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశారు. తన పొలంలో మిర్చి, వరి, మొక్కజొన్న, నువ్వులు సాగు చేసిన మొట్లగూడెంకి చెందిన రైతు నర్సింహారావు.. నిన్న అర్థరాత్రి కురిసిన అకాల వర్షానికి పంట మొత్తం నేలరాలింది. దీంతో తీవ్ర మనస్థాపానికి నర్సింహారావు పొలంలోనే పురుగుల మందు తాగినట్లు సమాచారం. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిసింది.