చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్ నుండి తప్పుకున్న సంగతి తెలిసిందే. గతంలో ఎప్పుడూ కూడా చెన్నై ఇంత పేలవమైన ప్రదర్శన ఇచ్చిన సందర్భాలు లేవు. ఈ పదమూడవ సీజన్లో ఎనిమిది మ్యాచులో ఓడిపోయి ప్లే ఆఫ్ చేరుకోవడంలో చతికిలబడింది. ఐతే ఈ సీజన్లో ఇలా కావడానికి కారణం సీఎస్కేలో యువ ఆటగాళ్ళు లేకపోవడమే అని చాలమంది అభిప్రాయపడుతున్నారు. జట్టులో ఎక్కువ మంది 30 నుండి 35 వయస్సు గల వారే ఎక్కువ ఉన్నారని దానివల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందని అంటున్నారు.
ఐతే ఈ మాటలపై మాజీ బౌలర్ ఆశిష్ నెహ్రా తనదైన రీతిలో స్పందించాడు. 30- 35 వయస్సు పెద్ద సమస్య కాదనీ, నేను 39వయస్సులో కూడా ఐపీఎల్ ఆడానని, ఆట ఆడడానికి ఎంత ఫిట్ గా ఉన్నామన్నదే ముఖ్యం కానీ ఎంత వయస్సులో ఉన్నామన్నది కాదని, ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ సరైన ప్రదర్శన ఇవ్వకపోవచ్చని, కానీ వచ్చే సంవత్సరం నాటికి మళ్ళీ పుంజుకుని అద్భుత ప్రదర్శన ఇవ్వగలదని అన్నాడు.