కొందరు మగాళ్లు చేస్తున్న పనులు సమాజానికే మాయని మచ్చను తీసుకు వస్తున్నాయి. మద్యం మత్తులో వికృత చేష్టలకు పాల్పడటం, ఆడవాళ్లను వేధించడం వంటి పనుల వలన బాధిత మహిళలతో పాటు ఉద్యోగాలు చేసేవారు, చదువునే విద్యార్థులు సైతం బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు.
ఈ క్రమంలోనే అస్సాం మాజీ సీఎం ప్రఫుల్ల కుమార్ మహంత్ కూతురిని డ్రైవర్ వేధించినట్లు తెలుస్తోంది. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ఆమె అతడికి తగిన గుణపాఠం చెప్పింది. మద్యం మత్తులో డ్రైవర్ తనను దూషించాడని ఆరోపించిన అస్సాం మాజీ సీఎం కూతురు.. అతన్ని చెప్పుతో కొట్టింది. సదరు డ్రైవర్‌ను మోకాళ్ల మీద కూర్చోబెట్టి చెప్పుతో కొడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
https://x.com/ChotaNewsApp/status/1896779953653584276