వైస్ ప్రిన్సిపల్ వేధింపుల కారణంగా రెసిడెన్షియల్ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది.ఈ ఘటన వికారాబాద్ జిల్లా కేంద్రంలోని కొత్తగడి రెసిడెన్షియల్ పాఠశాలలో సోమవారం ఆలస్యంగా వెలుగుచూసింది.
వైస్ ప్రిన్సిపల్ వేధింపుల కారణంగా భననం మొదటి అంతస్తు నుంచి దూకి విద్యార్థిని తబిత ఆత్మహత్యకు యత్నించింది.దీంతో ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనలో విద్యార్థిని కాలు విరిగినట్లు సమాచారం.వెంటనే వైస్ ప్రిన్సిపల్ మీద చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
https://twitter.com/TeluguScribe/status/1896784402098631038