బొట్టు పెట్టుకుని వచ్చారని విద్యార్థులను చితకబాదిన ప్రిన్సిపల్

-

చదువు చెప్పి విద్యార్థులను సరైన మార్గంలో నడిపించాల్సిన ఉపాధ్యాయులు బుద్ది మరిచి ప్రవర్తిస్తున్నారు. పాఠశాలల్లో అన్యమతాలను సమానంగా చూడాలని బోధించాల్సిన వారు ఒక వర్గానికి కొమ్ము కాస్తూ ఇతరులను కించపరుస్తూ వారి సంప్రదాయాల పట్ల హీనంగా ప్రవర్తిస్తున్నారు. బొట్టు, పూలు పెట్టుకోవడం, మాలాధారణ చేసినా నేరంగా పరిగణిస్తున్నాయి కొన్ని స్కూల్ మేనెజ్మెంట్స్.

తాజాగా పెద్దఅంబర్ పేట్ కండర్ షైన్ స్కూల్ ప్రిన్సిపల్ దాష్టీకం వెలుగుచూసింది.విద్యార్థులు బొట్టు పెట్టుకొని స్కూల్‌కి వచ్చారని ప్రిన్సిపల్ చితకబాదినట్లు తెలిసింది. అంతేకాకుండా బలవంతంగా వాష్ రూంలోకి తీసుకెళి బొట్టు తీయించినట్లు విద్యార్థినులు ఆరోపించారు. దీంతో స్కూల్‌లో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగడంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news