దేశ రాజధాని ఢిల్లీలో మరికొద్ది రోజుల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. బీజేపీ, కాంగ్రెస్, ఆప్ ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నాయి. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని ఎన్డీఏ కూటమి భావిస్తోంది. బీజేపీ తరపున ఎన్డీఏ నేతలు ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు. మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు.
తాజాగా ట్విట్టర్ వేదికగా ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఓ ట్వీట్ వేశారు. “ఈ రోజు, నేను చాందినీ చౌక్ అసెంబ్లీలో ఒక కుటుంబాన్ని కలుసుకున్నాను. వారికి ‘AAP యొక్క సేవింగ్స్ కార్డ్’ అందజేసి, వారితో కూర్చుని వారి పొదుపులను లెక్కించాను – ఈ కుటుంబం ప్రతి నెల ₹50,200 ఆదా చేస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, ప్రతి కుటుంబం ₹ 25,000 నుండి ₹ 50,000 వరకు ఆదా అవుతుంది. ఢిల్లీ ప్రజలారా, పొరపాటున కూడా బీజేపీకి ఓటు వేసి మీ పొదుపును వృధా చేసుకోకండి” అంటూ ట్వీట్ చేసాడు.