కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై మాజీ మంత్రి, చేవెళ్ల ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల పరిధిలో కల్యాణలక్ష్మి చెక్కులను ఆమె పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ గురించి, కాంగ్రెస్ హామీల గురించి ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో అక్కడకు వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి చేశారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల మీద కాంగ్రెస్ శ్రేణులు దాడి చేయడంపై ఆమె తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ కార్యకర్తల పట్ల కాంగ్రెస్ కార్యకర్తలు దౌర్జన్యంగా వ్యవహరించారని ఆమె విమర్శించారు.