హిందువులకు భూమన క్షణమాణలు చెప్పాలి : కూటమి నేతలు

-

హిందువులకు భూమన కరుణాకర్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని కూటమి నేతలు డిమాండ్ చేశారు.
తిరుపతి గోశాలలో వందకు పైగా గోవులు చనిపోయాయని అసత్యాలు ప్రచారం చేసినందుకు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి గోమాత కాళ్లు పట్టుకోవాలని వారు డిమాండ్ చేశారు.

జిల్లా ఎస్పీ సెక్యూరిటీ కల్పించినా భూమన రాలేదని.. జగన్ నాయకత్వంలోని వైసీపీ హిందుత్వంపై దాడులు చేస్తోందని వారు ఆరోపించారు. హిందువుల మనోభావాలు కించపరిచే విధంగా భూమన మాట్లాడారని వారు విమర్శించారు.అయితే, తిరుపతి వైసీపీ ఎంపీ గురుమూర్తి.. భూమన కరుణాకర్ రెడ్డి లేకుండానే ఒంటరిగానే గోశాలనుసందర్శించినట్లు తెలిసింది. అక్కడ కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీ గురుమూర్తి మధ్య వాగ్వాదం జరిగింది. గోశాలకు భూమన వస్తే ఎవరు అడ్డుకోవడం లేదని కూటమి ఎమ్మెల్యేలు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news