అధికార వైసీపీ పార్టీపై వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి. వైసీపీ మునిగిపోయే నావ లాంటిదని మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి పేర్కొన్నారు. జగన్ పాలనలో జనం విసిగిపోయారని, రాష్ట్ర అభివృద్ధిలో 20 ఏళ్లు వెనక్కిపోయిందని చెప్పారు.
వచ్చే ఎన్నికల్లో కమలాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని తెలిపారు. మార్చిలో కమలాపురం నియోజకవర్గం లోని తన వర్గీయులతో సమావేశమై టిడిపిలో చేరతామన్నారు. తనతో పాటు డిఎల్ రవీంద్ర రెడ్డి కూడా టిడిపిలోకి వస్తారని చెప్పారు.