మునుగోడు ఉప ఎన్నికల్లో BRS పేరుతో పోటీ చేస్తాం – మాజీ ఎంపీ వినోద్

-

కేంద్ర ఎన్నికల సంఘంతో టిఆర్ఎస్ నేతల బృందం సమావేశం ముగిసింది. టిఆర్ఎస్ పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చుతూ నిన్న పార్టీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని సీఈసీకి తెలిపారు. భారత్ రాష్ట్ర సమితి పేరును నమోదు చేయాలని వినతి చేశారు. అలాగే టిఆర్ఎస్ ను బిఆర్ఎస్ గా చేసిన తీర్మాన కాపీ, సీఎం కేసీఆర్ లేఖను అందజేశారు.

సమావేశం అనంతరం తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ మాట్లాడుతూ.. ఈనెల 14 లోపు బిఆర్ఎస్ గా మారుస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంటే మునుగోడు ఉప ఎన్నికలలో బిఆర్ఎస్ పేరుతో పోటీ చేస్తామన్నారు. లేకపోతే టిఆర్ఎస్ పేరుతోనే పోటీ చేస్తామని తెలిపారు. సీఈసీ త్వరలోనే తమ దరఖాస్తును పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది అన్నారు. దేశంలోని ఏ రాజకీయ పార్టీ అయినా తన పార్టీ పేరు, అడ్రస్ మార్చుకున్నప్పుడు కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియజేయాల్సి ఉంటుందని వినోద్ కుమార్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version