ఆస్కార్‌ బరిలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’.. ట్విటర్ వేదికగా ప్రకటించిన టీమ్

-

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఫ్యాన్స్ కు ఆ మూవీ టీమ్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది జరగనున్న ఆస్కార్ బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందిన ఈ సినిమాపై ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్ ట్విటర్ వేదికగా ఈ ప్రకటన విడుదల చేసింది.

‘‘ప్రపంచ బాక్సాఫీస్‌ వద్ద ఎన్నో రికార్డులతో భారతీయ సినిమా సత్తాని తెలియజేసేలా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు ఘన విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మా సినిమా నచ్చి.. గత కొన్ని నెలలుగా మాపై ప్రేమాభిమానాలు కనబరుస్తున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాం. ఇప్పుడు ఆస్కార్‌ రేసులో పోటీ పడేందుకు జనరల్‌ కేటగిరిలో మేము అప్లై చేశాం. మీ వల్లే మాకు ఇది సాధ్యమైంది. అందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు’’ అని ట్విటర్ వేదికగా ఈ మూవీ టీమ్‌ ట్వీట్ చేసింది.

కొంతకాలం క్రితం ప్రముఖ హాలీవుడ్‌ మ్యాగజైన్‌ వెరైటీ.. ఈ ఏడాది ఆస్కార్‌ బరిలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఉండే అవకాశం ఉందంటూ ఓ కథనం ప్రచురించింది. ఆనాటి నుంచి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఆస్కార్‌లోకి వెళ్లనుందని గట్టిగా ప్రచారం సాగింది. కానీ గుజరాతీ చిత్రం ‘చెల్లో షో’ను భారతదేశం తరఫున ‘ఆస్కార్‌’ నామినేషన్‌కు పంపుతున్నట్లు ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ప్రకటించడంతో సినీ ప్రియులు తీవ్ర నిరాశకు గురయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version