త‌ప్ప‌తాగి న్యూసెన్స్ చేసిన టీమిండియా మాజీ క్రికెట‌ర్.. అరెస్ట్

-

దూకుడైనా బ్యాటింగ్ చేస్తు అప్ప‌ట్లో వార్త‌ల్లో నిలిచే టీమిండియా మాజీ క్రికెట‌ర్ వినోద్ కాంబ్లీ.. ఇప్పుడు కూడా వార్త‌ల్లో నిలుస్తున్నాడు. గ‌తంలో ఒక సారి సైబ‌ర్ మోసానికి గురి అయ్యాడు. రూ. ల‌క్ష వ‌ర‌కు త‌న ఖాతా నుంచి మాయం అయ్యాయి. అప్పుడు వార్త‌ల్లో నిలిచాడు. తాజా గా వినోద్ కాంబ్లీ మ‌రోసారి వార్త‌ల్లో నిలిచాడు. అయితే ఈ సారి మాత్రం వినోద్ కాంబ్లీ ఏకంగా అరెస్ట్ కూడా అయ్యాడు. కాగ వినోద్ కాంబ్లీ త‌ప్ప తాగి.. త‌న కారును డ్రైవ్ చేస్తు.. బాంద్రాలోని తాను నివాసం ఉంటున్న రెసిడెన్సియ‌ల్ లోనే మ‌రో వ‌వాహాన్ని ఢీ కొట్టాడు.

అంతే కాకుండా.. అక్కడ ఉన్న సొసైటీ సెక్యూరిటీ గార్డు తోనూ వాగ్వాదానికి దిగాడు. దీంతో వాళ్లు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో.. పోలీసులు వినోద్ కాంబ్లీ ని ఆదివారం మ‌ధ్యాహ్నం అరెస్టు చేశారు. అనంత‌రం వినోద్ కాంబ్లీకి వైద్య ప‌రీక్షలు చేసి.. బెయిల్ పై విడుద‌ల చేశారు. కాగ వినోద్ కాంబ్లీ బ్యాటింగ్ దూకుడుగా ఉంటుంద‌ని అంటారు. అయితే అదే దూకుడు నిజ జీవితంలోనూ కొన‌సాగుతుంది. దీంతో వినోద్ కాంబ్లీకి వివాదాలు చుట్టు ముడుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version