యూఎస్ మాజీ ప్రెసిడెంట్ జార్జ్ బుష్ కన్నుమూశారు. ఆయన వయసు 94 ఏళ్లు. ప్రస్తుతం ఆయన హౌస్టన్ లో నివాసముంటున్నారు. బుష్ అధికార ప్రతినిధి జిమ్ మెక్ గ్రాత్ ఆయన మరణ వార్తను ప్రపంచానికి తెలియజేశారు. ఆయన యూఎస్ కు 43 వ అధ్యక్షుడిగా పనిచేశాడు. అమెరికాలో కోల్డ్ వార్ అంతానికి జార్జ్ బుష్ ఎంతో కృషి చేశారు.
1964 లో బుష్ రాజకీయాల్లోకి వచ్చారు. గత ఏప్రిల్ లో అనారోగ్య కారణాలతో ఆయన్ను ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన భార్య బార్బరా చనిపోయిన వారానికే ఇన్ఫెక్షన్ తో ఆయన ఆరోగ్యం కూడా చెడిపోయింది. దీంతో అప్పటి నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు.
Statement by the 43rd President of the United States, George W. Bush, on the passing of his father this evening at the age 94. pic.twitter.com/oTiDq1cE7h
— Jim McGrath (@jgm41) December 1, 2018