40 ఏళ్ల వయసులో వివాహం చేసుకోబోతున్న మాజీ విశ్వసుందరి..!!

-

బాలీవుడ్ హీరోయిన్, విశ్వసుందరి సుస్మిత సేన్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఈమె మూడుసార్లు వివాహం చేసుకోవాలనుకున్నప్పటికీ.. వివాహం వరకు వచ్చి ఆగిపోవడం జరుగుతూ ఉండేవి దీంతో ఆమె వివాహం పైన నమ్మకం లేదనే వ్యాఖ్యలు గత కొద్ది రోజుల క్రిందట చేయడం జరిగింది. కానీ ఇప్పుడు తాజాగా ఈమె వివాహం చేసుకోబోతోంది అనే వార్తలు వినిపిస్తున్నాయి వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ప్రముఖ బిజినెస్ మ్యాన్ అయిన లలిత్ మోడీ, సుస్మితాసేన్ తో డేటింగ్ లో ఉన్నట్లుగా ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా తామిద్దరం త్వరలోనే వివాహం చేసుకోబోతున్నామని ఒక ట్వీట్ చేయడం జరిగింది దీంతో ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోయారు. ఈ విషయం సుస్మిత సేన్ సోదరుడికి తెలియడంతో అతడు కూడా షాక్ అయినట్లుగా తెలుస్తోంది. ఇక అంతే కాకుండా సుస్మితాసేన్ లలిత్ మోడీకి సంబంధించి కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక లలిత్ మోడీ సుస్మితాసేన్ ని తనకు సరైన జోడి అని సంబోధించడం జరిగింది.

ఇక అంతే కాకుండా మా ఇద్దరి జీవితం ఇదొక కొత్త ప్రారంభం అని కూడా తెలియజేశారు. కేవలం మేమిద్దరం డేటింగ్ లోనే ఉన్నాము త్వరలోనే వివాహం చేసుకోబోతున్నాం అన్నట్లుగా తెలియజేశారు. ప్రస్తుతం ఈ ట్విట్ కాస్త చాలా వైరల్ గా మారుతున్నది. ఇక గతంలో కూడా సుస్మితసేన్ మోడల్ రోహ్మన్ తో కూడ డేటింగ్ చేసింది.కానీ కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ విడిపోవడం జరిగింది. ఆ వార్త ప్రతి ఒక్కరిని కూడా షాక్ గురయ్యాలా చేసింది. ఇక అంతే కాకుండా సినీ ఇండస్ట్రీలో ఉండే పలువురు స్టార్ నటులతో కూడా ఈమె డేటింగ్ చేసిందనే వార్తలు బాగా వినిపించాయి. కానీ ఎన్నో సంవత్సరాల నుంచి ఈమె పెళ్లి విషయం గురించి మాత్రం తెలియజేయలేదు. ఎన్నిసార్లు అడిగినా కూడా ఒంటరిగానే ఉన్నానని తెలియజేస్తూ ఉండేది.. కానీ ఇప్పుడు లలిత్ మోడీతో డేటింగ్ చేస్తుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి.40 ఏళ్ల వయసులో వివాహం చేసుకోబోతోందా అన్నట్లుగా కామెంట్లు చేస్తున్నారు నేటిజన్స్..

Read more RELATED
Recommended to you

Exit mobile version