వైసీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరో షాక్ తగిలింది. వల్లభనేని వంశీపై మరో రెండు కేసులు నమోదు అయ్యాయి. వైసీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై భూకబ్జా, రైతులను మోసం చేసిన కేసులు చేశారు. మల్లపల్లి పారిశ్రామికవాడలో 128 మంది రైతులకు ప్రభుత్వ పరిహారం అందకుండా మోసం చేశారని కేసు నమోదు అయింది.
ఓ వ్యక్తికి సంబంధించిన భూమిని కబ్జా చేసినందుకు వైసీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, అతని అనుచరులపై కేసు నమోదు అయింది. ఇది ఇలా ఉండగా..మార్చి 11 వరకు వల్లభనేని వంశీ రిమాండ్ పొడగించారు. వంశీతో పాటు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఉన్న నలుగురు నిందితులకు కూడా రిమాండ్ పొడిగించారు న్యాయమూర్తి.