వైసీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ నుంచి యూరియా తెలంగాణకు తరలిపోతోందని ఆరోపణలు చేశారు. యూరియా అందించడంలో, పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని విమర్శలు చేశారు.

‘అన్నదాత పోరు’ కార్యక్రమంలో వైసీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక అటు యూరియాపై భూమన అభినయ్ వినూత్న ప్రదర్శన చేశారు. ఏపీలో రైతుల సమస్యలను ప్రజలకు అర్థమయ్యేలా నిరసన తెలిపిన వైసీపీ నేత భూమన అభినయ్. రైతులు పడుతున్న బాధలు, ఎరువుల కొరత.. బ్లాక్ మార్కెట్‌కు ఎరువుల తరలింపు.. కూటమి పెద్దల మౌనంపై తిరుపతిలో వినూత్న నిరసన చేశారు.