సీఎంతో సహా మంత్రులు కూడా సినిమాలలో నటించడంపై ఇకనుంచి ఎలాంటి నిషేధం లేదని హైకోర్టు తాజాగా పేర్కొంది. మాజీ సీఎం, సినీ నటుడు ఎన్టీఆర్ విషయంలోనే హైకోర్టు అప్పట్లో తీర్పునిచ్చిందని గుర్తు చేశారు. హరిహర వీరమల్లు సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ పిటిషన్ వేయగా… జస్టిస్ వెంకట జ్యోతి ఈ విధంగా తీర్పునిచ్చారు.

ఈ నెల 15 వరకు విచారణ వాయిదా వేశారు. ఇదిలా ఉండగా… ఇప్పటివరకు సినిమాలలో నటిస్తూ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన వారు ఎందరో ఉన్నారు. అలాంటి వారిలో చిరంజీవి, విజయశాంతి, పవన్ కళ్యాణ్, సీనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ లాంటి ఎంతోమంది నటీమణులు ఓవైపు సినిమాలలో నటిస్తూ మరోవైపు రాజకీయాలలో వారి పాత్రను చురుగ్గా కొనసాగిస్తున్నారు. రాజకీయాలలో ఎప్పుడు బిజీగా ఉన్నప్పటికీ సమయం దొరికినప్పుడల్లా సినిమాలలో నటిస్తూ వారి అభిమానులకు చేరువలో ఉంటున్నారు.