వియరబుల్ ఉత్పత్తుల తయారీదారు ఫాసిల్ భారత్‌లో కొత్తగా ఫాసిల్ జెన్ 5ఇ పేరిట ఓ స్మార్ట్‌వాచ్‌ను విడుదల చేసింది. ఇందులో 1.19 ఇంచుల అమోలెడ్ డిస్ప్లే, క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ వియర్ 3100 ప్రాసెసర్, ఇంటర్ చేంజబుల్ వాచ్ బ్యాండ్స్, క్విక్ చార్జింగ్ తదితర ఫీచర్లను అందిస్తున్నారు.
ఫాసిల్ జెన్ 5ఇ వాచ్ 42, 44 ఎంఎం సైజుల్లో విడుదలైంది. వాచ్ స్ట్రాప్స్ 22 ఎంఎం వెడల్పును కలిగి ఉంటాయి. ఈ వాచ్‌లో 1జీబీ ర్యామ్, 4జీబీ స్టోరేజ్‌లను అందిస్తున్నారు. దీనికి వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ ఉంది. హార్ట్ రేట్‌ను ఏర్పాటు చేశారు. దీంతో రియల్‌టైంలో హార్ట్ రేట్‌ను తెలుసుకోవచ్చు. అలాగే డిస్టాన్స్, స్టెప్, కెలోరీ కౌంట్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
ఈ వాచ్‌లో బిల్టిన్ మైక్రో ఫోన్ ఉంది. అలాగే స్పీకర్ కూడా ఉంది. గూగుల్ అసిస్టెంట్‌కు సపోర్ట్ లభిస్తుంది. 24 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. క్విక్ చార్జింగ్కు సపోర్ట్ లభిస్తుంది. కేవలం 50 నిమిషాల్లోనే 80 శాతం వరకు చార్జింగ్ పూర్తవుతుంది. ఈ వాచ్ బ్లాక్ సిలికాన్, బ్రౌన్ లెదర్, బ్లాక్ స్టెయిన్ లెస్ స్టీల్, టు-టోన్ స్టెయిన్‌లెన్ స్టీల్, రోజ్ గోల్డ్-టోన్ స్టెయిన్లెస్ స్టీల్ మెష్ కలర్ ఆప్షన్లలో ఈ వాచ్ విడుదలైంది. రూ.18,495 ధరకు ఈ వాచ్ ఫ్లిప్‌కార్ట్‌లో లభిస్తోంది.