బాలయ్య ఇలాకాను మూయించేసిన గుజరాతీలు!

-

అనంతపురం జిల్లా హిందూపురంలో రోజు రోజుకీ కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ హిందూపురంలో మొత్తం 45 కేసులు నమోదయ్యాయి. చిత్రం ఏమిటంటే… వీటిలో 50 శాతానికి పైగా కేసులు గుజరాత్ కు చెందినవారివే కావడం గమనార్హం. అవును… హిందూపురంలో ఉంటున్న గుజరాత్ కు చెందిన 24 మంది కరోనా బారిన పడ్డారంట. ఈ విషయాలపై క్లారిటీ ఇచ్చారు అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు!

ఈ క్రమంలో కరోనా పాజిటివ్‌ కేసుల నేపథ్యంలో నేటి నుంచి సరిగ్గా నాలుగు రోజుల పాటు హిందూపురంను పూర్తిగా బంద్‌ చేస్తున్నామని… కర్ఫ్యూ స్థాయిలో లాక్‌ డౌన్‌ పక్కాగా అమలు చేస్తున్నామని.. తాజా పరిస్థితుల నేపథ్యంలో రోజు రోజుకీ నిబంధనలు సైతం మరింత కఠినతరం చేస్తున్నామని కలెక్టర్ వెల్లడిస్తున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో సుమారు మూడురోజులుగా హిందూపురంలోనే మాకాం వేసిన కలెక్టర్‌ ఇప్పటికే పలు దఫాలుగా వైద్యాధికారులు, రెవెన్యూ, మున్సిపల్‌ మొదలగు అధికారులతో పాటు మత పెద్దలతో కూడా సమావేశమయ్యి… వారందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని రానున్న నాలుగురోజులు పూర్తిగా బంద్‌ చేస్తున్నట్లు ప్రకటించారు.

ఈ సందర్భంగా హిందూపురం నియోజకవర్గ ప్రజలు ఎవరూ బయటకు వచ్చేందుకు ప్రయత్నించవద్దని.. అలాంటి వీలు లేదని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో రెడ్‌ జోన్‌ తో పాటు అన్ని ప్రాంతాల్లోని వారికి నిత్యావసర వస్తువులు, సరుకులు, పాలు, మందులు అన్నీ ఇళ్ల వద్దకే చేరేలా చర్యలు చేపడుతున్నామని జిల్లా కలెక్టర్‌ స్పష్టం చేశారు. ఈ విషయంలో రాజకీయ పార్టీల పేరుచెప్పి కానీ.. మరే పేరు చెప్పి కానీ.. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు!

Read more RELATED
Recommended to you

Latest news