ఎంఐఎం పార్టీకి భారీ షాక్.. ఆ నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయనున్నారా?

-

దేశమంతా విస్తరించాలని కలలు కంటోన్న ఎంఐఎం పార్టీ, మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీకి భారీ షాక్ తగిలింది. బీహార్‌లో మజ్లిస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయనున్నట్లు సమాచారం. ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఆర్జేడీ గూటికి చేరనున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఎంఐఎం పార్టీ గత అసెంబ్లీ ఎన్నికలలో బీహార్‌లో పోటీ చేసింది. రాష్ట్రంలో ముస్లిం ఓట్లు గణనీయం ఉండటంతో.. ఎంఐఎం పార్టీ గెలుపొందింది. ఆర్జేడీ ప్రతిపక్షానికి మాత్రమే పరిమితమైంది.

అసదుద్దీన్ ఓవైసీ

అయితే, తాజాగా ఎంఐఎం పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ఆర్జేడీలో వీలినం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తను ఎంఐఎం నాయకుడు అక్తరుల్ ఇమామ్ కొట్టిపారేశాడు. ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు, కానీ మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆర్జేడీలో విలీనం కావట్లేదన్నారు. కానీ, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ మాత్రం.. త్వరలో ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేలు ఆర్జేడీలో చేరబోతున్నట్లు తెలిపారు.

2025 అసెంబ్లీ ఎన్నికల్లో బీహార్ మజ్లిస్ ఎమ్మెల్యేలు ఓటర్లు తమను చిత్తుగా ఓడిస్తారని భయపడుతున్నారు. దీంతో ఆర్జేడీలో చేరాలని యోచిస్తున్నారు. ఎంఐఎం ఎమ్మెల్యేలు ఆర్జేడీలో చేరితో 76 మంది ఎమ్మెల్యేలతో ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా అవతరించనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version