రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఆర్టీసీని సైతం అమ్మకానికి పెడుతుంది: మంత్రి హరీష్ రావు

-

బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఆర్టీసీని సైతం అమ్మకానికి పెడుతుందని మంత్రి హరీష్ రావు అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ లో బస్ డిపోను మంత్రి పువ్వాడ అజయ్ తో కలిసి ప్రారంభించారు హరీష్. అనంతరం హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ట్రెడిషినల్ హెల్త్ సెంటర్ ను హైదరాబాద్ లో పెడతామని నాకు ఉత్తరం రాశాడు అని, నేను స్థలం ఇస్తా, పైసలు ఇస్తా అన్నాను పెట్టు అని లెటర్ రాశాను అన్నారు.

కానీ మూడు రోజుల తర్వాత అది గుజరాత్ కి వెళ్లిపోయిందని.. కిషన్ రెడ్డి ముఖం ఎక్కడ పెట్టుకోవాలో అర్థం అవుతుందా అని ఎద్దేవా చేశారు. డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్న కర్ణాటకలో పరిస్థితి ఏంటని ఈ సందర్భంగా మంత్రి ప్రశ్నించారు. కర్ణాటకలో రూ.1400 కు క్వింటాలు వడ్లు కొంటే.. తెలంగాణలో రూ. 1920 కి కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. కర్ణాటక రైతులు మన రాష్ట్రానికి ధాన్యం తెచ్చి అమ్ముకుంటున్నారు అన్నారు. తెలంగాణలోని సంక్షేమ పథకాలు కర్ణాటకలో లేవన్నారు.బిజెపికి గుజరాత్ తప్ప మరో ఆలోచన లేదన్నారు. కేంద్రం తీరు తెలంగాణకు మాటలు.. గుజరాత్ కు మూటలు అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version