ఇవాళ నాలుగో రోజు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అలాగే ఉదయం 10 గంటలకు నాలుగో రోజు మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే ఇవాళ మూడు రాజధానుల చట్ట ఉప సంహరణ బిల్లు మండలి ముందుకు రానునుంది. ఈ మూడు రాజధానుల చట్ట ఉప సంహరణ బిల్లు ను ప్రవేశ పెట్టనున్నారు ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. వ్యవసాయం, రైతు భరోసా కేంద్రాలు, విద్యుత్ సంస్కరణల పై షార్ట్ డిస్కషన్ ఉండనున్నట్లు సమాచారం అందుతోంది.
ఇది ఇలా ఉండగా మరో అనూహ్య అడుగు దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. శాసనమండలి రద్దు తీర్మానాన్ని వెనక్కి ఉపసంహరించుకోనుంది ప్రభుత్వం. గతంలో శాసనమండలిని రద్దు చేస్తు తీర్మానం చేసింది అసెంబ్లీ. ఈ తీర్మానాన్ని ఉపసంహరించుకుంటూ మరో తీర్మానాన్ని అసెంబ్లీ ప్రవేశ పెట్టనుంది అసెంబ్లీ. ఉపసంహరణ తీర్మానం కాపీని కేంద్రానికి పంపనుంది జగన్ ప్రభుత్వం. కాగా నిన్నటి రోజున.. మూడు రాజధానుల చట్ట ఉప సంహరణ బిల్లును ఏపీ శాసన సభ ఆమోదం తెలిపన సంగతి తెలిసిందే.