తెలంగాణా రాష్ట్రంలో త్వరలో ఉద్యోగాల భర్తీ చేపడతామని సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మేరకు కసరత్తులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ఉన్న ఖాళీగా ఉన్న పోస్టుల్లో టీచర్ పోస్టులు కూడా భారీగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే తాజాగా రాష్ట్రంలో మొత్తం 18వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని అధికారులు వెల్లడించారు. మొత్తం 1.20లక్షల టీచర్ పోస్టులకు గానూ ప్రస్తుతం 1.02 లక్షల మంది పనిచేస్తున్నారని అధికారులు గుర్తించారు.
అంతే కాకుండా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 18 వేల టీచర్ పోస్టులను కొత్త జిల్లాలుగా విభజించి కేటాయిస్తారని సమాచారం. ఈ 18వేల పోస్టులు కాకుండా మరో 1500 బోధనేత, డైట్, బీఈడీ కాలేజీలు, విద్యాశాఖ కార్యాలయాల్లో పోస్టులను కూడా జిల్లాల వారీగా విభజించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే గతంలో కూడా రాష్ట్రంలో 20వేలకు పైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని అన్నారు. కానీ కేవలం 7వేల పైచిలుకు పోస్టుల తో నోటిఫికేషన్ ను విడుదల చేసారు. మరి ఈసారైనా మెగా డీఎస్సీ ఉంటుందా లేదా అని టీచర్ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.