అడవిలో సంచరించాల్సిన క్రూరమృగాలు గ్రామాల్లోకి వస్తున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అనుకోకుండా ఆదివారం ఉదయం ఓ నక్క ఆహారం కోసం ఓ గ్రామంలోకి ప్రవేశించింది. ముస్తాబాద్ మండలంలోని పలువురిపై నక్క దాడి చేసి గాయపరిచి నట్లు తెలుస్తోంది.
ఉదయాన్నే ఇంటి ముందు పనులు చేస్తున్న ఓ మహిళపై నక్క తీవ్రంగా దాడి చేసింది. ఈ ఘటనలో సూత్రం రాధ అనే మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. స్థానికులు వెంటనే అప్రమత్తమై నక్కను పట్టుకుందామని ప్రయత్నించి చివరకు దానిని కొట్టి చంపారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. గాయపడిన మహిళలకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఒక్కసారిగా నక్క గ్రామంలోకి వచ్చి దాడులు చేయడంతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.