తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన షెడ్యూల్ విడుదల అయ్యింది. జనవరి 17వ తేదీన ఆయన విదేశాలకు ప్రయాణం చేయనున్నారు. సీఎంతో పాటు ఆయన వ్యక్తిగత బృందం, పలువురు మంత్రులు, అధికారులు సైతం వెళ్లనున్నారు. జనవరి 18న ముఖ్యమంత్రి సింగపూర్‌లో పర్యటిస్తారు.
అక్కడి షాపింగ్ మాల్స్, క్రీడా స్టేడియాల నిర్మాణాలను పరిశీలిస్తారు. అనంతరం పారిశ్రామికవేత్తల సమావేశంలో పాల్గొంటారు. జనవరి 19న సింగపూర్ నుంచి స్విట్జర్లాండ్‌లోని దావోస్‌కు సీఎం వెళ్లనున్నారు. ఇక జనవరి 23వ తేదీన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొన్నాక తిరిగి దేశానికి రానున్నారు. సంక్రాంతి పండుగ తర్వాత ఆయన విదేశీ పర్యటన ప్రారంభం కానుంది