Breaking : నేటి నుంచి ఉచితంగా బూస్టర్‌ డోస్‌

-

యావత్త ప్రపంచ దేశాలను భయాందోళనకు గురి చేస్తున్న కరోనా రక్కసి మరోసారి విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. కొత్త కొత్త వేరియంట్లతో ప్రజలపై విరుచుకుపడుతున్న కరోనాను కట్టడి చేసేందుకు బూస్టర్‌ డోస్‌ ఒక్కటే మార్గమని, బూస్టర్‌ డోస్‌ పంపిణీకి పూనుకుంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో.. భారత్ లో శుక్రవారం నుంచి కరోనా​ బూస్టర్​ డోస్ ను ఉచితంగా వేయనున్నారు.​ 18 ఏళ్లు పైబడిన వారికి ఉచితంగా కరోనా వాక్సిన్ బూస్టర్ డోసు ఇవ్వనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.

రెండో డోసు తీసుకుని 6 నెలలు పూర్తయిన వారికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా బూస్టర్ డోసు వేస్తారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోనూ నేటి నుంచి బూస్టర్​ డోస్ అందుబాటులోకి రానుంది.​ ఈ క్రమంలోనే తెలంగాణలోని అన్ని ప్రభుత్వ దవాఖానల్లో బూస్టర్‌ డోస్‌ పంపిణీకి వైద్యారోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు చేసినట్లు ప్రకటించింది. నేటి నుంచి తెలంగాణలో బూస్టర్‌ డోస్‌ పంపిణీ ప్రారంభం కానుంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version