తెలంగాణలో ఈ నెల 3వ తేదీ నుంచి చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేస్తామని రాష్ట్ర పశు సంవర్థక శాఖ నిర్ణయించింది. తొలిఫేజ్‌లో మత్స్యశాఖ అధికారులు హనుమకొండ, వరంగల్, ములుగు, మహబూబాబాద్, భూపాలపల్లి, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, గద్వాల జిల్లాల్లో చేపజిల్లాలను పంపిణీ చేయనున్నారు. ఆ తర్వాత 7వ తేదీన మిగతా జిల్లాల్లో ఈ ప్రక్రియను ప్రారంభించనున్నారు. అందుకోసం సంబంధిత అధికారులకు ఆదేశాలు వెళ్లాయి.
ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొనాలని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. చేపపిల్లల పంపిణీ కార్యక్రమం రాష్ట్రంలో పెద్దఎత్తున నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులోప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చింది. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటనతో రాష్ట్రంలోని మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.