నేటి నుండి తెలంగాణ వ్యాప్తంగా ఉచిత చేప పిల్లల పంపిణీ

-

తెలంగాణ రాష్ట్రంలోని మత్య్స కారులకు కేసీఆర్‌ సర్కార్‌ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఉచిత చేప పిల్లల పంపిణీకి రంగం చేసింది కేసీఆర్‌ సర్కార్‌. ఇందులో భాగంగానే… నేటి నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనుంది కేసీఆర్‌ సర్కార్‌.

వరంగల్ స్టేషన్ ఘన్ పూర్ లో ఉచిత చేప పిల్లల పంపిణీని ప్రారంభించనున్నారు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, MLA రాజయ్య. ఈ సంవత్సరం 26,778 నీటి వనరులలో 88.53 కోట్ల చేప పిల్లల విడుదల చేయనుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు తెలంగాణ అధికారులు.

వరంగల్ స్టేషన్ ఘన్ పూర్ లో ఉచిత చేప పిల్లల పంపిణీని ప్రారంభించిన అనంతరం.. తెలంగాన రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగనుంది. విస్తారంగా వర్షాలు కురిసి చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు నీటితో కళకళలాడుతున్నాయని… దీంతో ఈ సంవత్సరం రూ.88.53 కోట్లు ఖర్చుచేసి 68 కోట్ల చేప పిల్లలను, రూ.24.50 కోట్లతో 10 కోట్ల రొయ్య పిల్లలను అందజేయాలని నిర్ణయించామన్నారు తలసాని శ్రీనివాస్ యాదవ్.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version