మేడారం జాతరలో భక్తులకు బీఎస్ఎన్ఎల్ ఉచిత వైఫై !

-

తెలంగాణ కుంభమేళ.. అతిపెద్ద జాతర అయిన మేడారం సమ్మక్క సారాలమ్మ జాతరకు వెళ్లే భక్తులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వానికి చెందిన టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగం లిమిటెడ్ బీఎస్‌ఎన్‌ఎల్‌ మేడారం భక్తులకు ఉచితంగా వైఫై సదుపాయాన్ని కల్పించింది. భక్తులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ బీఎస్ఎన్ఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 5 నుంచి 9వ తేదీ వరకు భక్తులకు ఉచిత వైఫై సేవలు అందుబాటులో ఉంటాయి. భక్తులకు వైఫై సేవలు నిరంతరాయంగా అందించేందుకు 20 వైఫై హాట్ స్పాట్లను ఏర్పాటు చేసింది బీఎస్ఎన్ఎల్. జాతర పరిసర ప్రాంతాల్లో సిగ్నల్స్ కోసం G BTS-13, 3G BTS-14,4G BTS-1 ఇన్‌స్టాల్ చేసినట్టు తెలిపారు. మేడారంలో ఉచితంగా బీఎస్ఎన్ఎల్ వైఫై సేవలు వాడుకోవాలంటే యూజర్లు సెట్టింగ్స్ మార్చాల్సి ఉంటుంది. ఆ సెట్టింగ్స్ ఎలా చేయాలో తెలుసుకోండి.

సెట్టింగ్స్‌ ఇలా చేసుకోండి !

ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో వైఫై ఆన్ చేయండి. QFI-BSNL-FREE-WIFI@Medaram పేరుతో వైఫై నెట్‌వర్క్ కనిపిస్తుంది. దానికి కనెక్ట్ అవండి. మీ ఫోన్‌లో ఇంటర్నెట్ బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ చేయండి. ఆ తర్వాత నాలుగు అంకెల పిన్ ఎంటర్ చేసి లాగిన్ చేయండి. స్టార్ట్ బ్రౌజింగ్ పైన క్లిక్ చేస్తే మీకు వైఫై కనెక్ట్ అవుతుంది. ఇక ఆలస్యమెందుకు వెంటనే జాతరకు వెళ్లండి ఉచిత వైఫైతో ఇబ్బంది లేకుండా ప్రయాణం, వనదేవతల దర్శనం చేసుకోండి.

-కేశవ

Read more RELATED
Recommended to you

Exit mobile version