ఫ్రీగా T20 వరల్డ్ కప్..ఎందులో అంటే ?

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముగిసిన వెంటనే T20 ప్రపంచకప్‌ మొదలవనుందన్న విషయం తెలిసిందే.జూన్‌ 2 నుంచి 29 వరకూ జరిగే మెగా టోర్నీ కి అమెరికా, వెస్ట్ ఇండీస్ ఆథిత్యం ఇవ్వనున్నాయి. ఈ టోర్నీ కోసం ఇప్పటికే అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు.ఇదిలా ఉంటే…క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్ తెలిపింది బీసీసీఐ. జూన్ 2 నుంచి ప్రారంభమయ్యే టీ20 వరల్డ్ కప్ను డిస్నీప్లస్ హాస్టార్ ఉచితంగా ప్రసారం చేయనుంది. ఇండియాలోని యూజర్లు మొబైల్ వెర్షన్లో దీన్ని ఉచితంగా ఆస్వాదించవచ్చు. గత వన్డే వరల్డ్ కప్తో పాటు ఆసియా కప్ను సైతం ఉచితంగా ప్రసారం చేయగా.. రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి.

కాగా, ఈ t 20 ప్రపంచ కప్ లో పాల్గొనే 20 జట్లను ఐసీసీ 4 గ్రూపులుగా విభజించింది.గ్రూప్-ఎలో భారత్, ఐర్లాండ్,పాకిస్థాన్, అమెరికా, కెనడా ఉన్నాయి. గ్రూప్-బిలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా,స్కాట్లాండ్, నమీబియా, ఒమన్ ఉన్నాయి. గ్రూప్-సిలో న్యూజిలాండ్,వెస్టిండీస్, ఆప్ఘనిస్తాన్, పపువా న్యూగినియా,ఉగాండ ఉన్నాయి. గ్రూప్-డిలో సౌత్ ఆఫ్రికా, శ్రీలంక, నెదర్లాండ్స్, నేపాల్ ,బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version