ఫ్రెండ్ మృతదేహంతో 3 వేల కిలోమీటర్లు వెళ్ళాడు…!

-

లాక్ డౌన్ అమలులో ఉండటంతో ఎవరూ కూడా ఒక చోట నుంచి మరో చోటకు వెళ్ళే అవకాశం లేదు అనే విషయం అర్ధమవుతుంది. సామాన్యులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. వలస కార్మికుల కష్టాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇదే కొనసాగితే ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నా పరిస్థితులు ఇప్పట్లో చక్కబడే అవకాశాలు లేవు అనే చెప్పాలి.

తాజాగా ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్ల్కి వెళితే మిజోరం ప్రాంతానికి చెందిన వివియన్ అనే వ్యక్తి చెన్నై లో నివాసం ఉంటున్నాడు. అయితే అతను అనారోగ్యం కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పుడు అతని శవాన్ని సొంత రాష్ట్రానికి తరలించడం చాలా కష్టంగా మారింది. దీనితో అతని స్నేహితుడు మల్చహాన్ హిమా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. మిజోరానికి తరలించడానికి గానూ అంబులెన్స్ ని సిద్దం చేసాడు.

డ్రైవర్లు ఇద్దరు అతని వెంట వచ్చారు. దీనితో మృతదేహాన్ని తీసుకుని మూడు వేల కిలోమీటర్లు ప్రయాణం చేసాడు. అంబులెన్స్ ను చెన్నై మిజో వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేసి… పోలీసులు పాస్ ఇచ్చారు. 3వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఐజ్వాల్ పట్టణానికి చేరుకొని అతని మృతదేహాన్ని తల్లి తండ్రులకు అప్పగించారు.

Read more RELATED
Recommended to you

Latest news