ప్రెండ్స్ అంటే ప్రాణం ఇస్తారు కొందరు. తెలియని ప్రపంచాన్ని పరిచయం చేస్తూ.. కష్టకాలంలో వెన్నంటే నిలబడతాడు. కానీ ఈ సంఘటన స్నేహితులకే మరని మచ్చలాంటిది. గత కొన్ని రోజులుగా కనిపించకుండా పోయినా సోయిడా బిజినెస్ మెన్ ఆదిత్య సోని శవమై సోమవారం గ్యాంగ్ కాలువ సమీపంలో కనిపించింది. ఈ నెల 5వ తేదీన ఆదిత్య తన ఇంటి నుంచి ఢిల్లీలోని ఓ బంధువులను కలవడానికి వెళ్ళాడు. అతను మళ్లీ తిరిగి ఇంటికి చేరుకోలేదు. ఆదిత్య కోసం కుటుంబ సభ్యులు స్నేహితుల్లో, కుటుంబ సభ్యుల్లో వాకబూ చేసినా ఫలితం కనిపించలేదు. దీంతో అతడి కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేసన్ లో ఫిర్యాదు చేశారు.
సోమవారం గ్యాంగ్ కాలువ సమీపంలో ఆదిత్య పార్థివ దేహాం లభ్యమైంది. అతని మృతికి కారణమైన వారు పంకజ్, దేవ్ అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరూ ఆదిత్య స్నేహితులు కావడం విశేషం. దీంతో పోలీసులు ఇద్దరిని విచారించగా ఆదిత్యను హత్య చేయడానికి కారణం తెలిసి పోలీసులు నివ్వెరబోయారు. పంక్షన్ కి వెళ్లి ఆదిత్య తమను కలవడానికి వచ్చాడని, అందరూ మాట్లాడుతుండగా ఆదిత్య మధ్యలో ఓ జోన్ చేశాడని, దాంతో ముగ్గురి మధ్య గొడవ నెలకొందన్నారు.
కోపం ఆదిత్యపై కర్రతో దాడి చేయడం జరిగిందన్నారు. దాడిలో ఆదిత్యకు తీవ్రంగా గాయపడి మరణించాడన్నారు. అతడి నుంచి సెల్ ఫోన్, బంగారం తీసుకుని ఆదిత్య శవాన్ని స్థానికంగా ఉన్న గ్యాంగ్ కాలువ పక్కనున్న డంప్ యార్డ్ లో పడేశామని అన్నారు. మాట మధ్యలో చిన్న జోక్ చేసినందుకు ప్రాణాలే తీస్తారా అంటూ పోలీసులు షాక్ కు గురయ్యారు. ఆదిత్య కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పంకజ్, దేవ్ లపై కేసు నమోదు చేశారు పోలీసులు. కొడుకు చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. నిందితులను కఠినంగా శిక్షించాలని వారు పేర్కొన్నారు.