ఆంధ్రప్రదేశ్ ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల కొండపై విమానం అధికారులను కలవరానికి గురి చేసింది. నో ఫ్లైయింగ్ జోన్ గా ఉన్న కొండపై విమానం ఎగారడంతో అందరూ కంగారు పడ్డారు. అసలు ఎం జరుగుతుందో అర్ధం కాక భద్రతా అధికారులు కాసేపు ఆందోళన వ్యక్తం చేసారు. వాస్తవానికి తిరుమలపై ఎగిరింది కేంద్ర ప్రభుత్వం విమానం. ఆ తర్వాత అసలు విషయం తెలిసి అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఐదేళ్లకోసారి సర్వే ఆఫ్ ఇండియా(ఎస్‌వోఐ) విమానాల ద్వారా భౌగోళిక పరిస్థితులను సర్వే చేయిస్తూ ఉంటుంది. ఈ నేపధ్యంలోనే ఛార్టెర్డ్ విమానం రెండు రోజులుగా సర్వే చేస్తుంది. ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీవారికి ఎగువున విమానాలు ఎగరకూడదనే నియమం ఉంది. ఈ వ్యవహారంపై గతంలోనూ ఏవియేషన్ ఆఫ్ ఇండియాకు తిరుమల తిరుపతి దేవస్థానం ఫిర్యాదు చేసింది. ఇక మళ్ళీ ఇప్పుడు ఎగురుతున్న విమానం గురించి టీటీడీ విజిలెన్స్ అధికారులు.. చెన్నై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ (ఏటీసీ)కు ఫిర్యాదు చేశారు.
ఇకపై తిరుమల క్షేత్రంపైకి విమానాలు పంపబోమని ఏటీసీ అధికారులు హామీ ఇచ్చారని అధికారులు పేర్కొన్నారు. తిరుమల కొండపై విమానాలు తిరిగరాదనే ఇప్పటికే ఏపీ ప్రభుత్వం సైతం కేంద్రాన్ని కోరినట్టు సమాచారం. ఇక తిరుమల కొండపై దేవతలు విహరిస్తుంటారని అందుకే ఆ ప్రాంతంలో విమానాలు నిషేధమని చెప్తే… వాస్తవంగా అయితే… కొండ ప్రాంతంలో పాజిటివ్ రేస్ ఎక్కువగా ఉంటాయి. అందుకే అక్కడ ఎలాంటి విమానాలు తిరిగినా అవి పేలిపోయి ప్రమాదాలు జరుగుతుంటాయని, గతంలో బ్రిటీష్ విమానాలు పేలిపోయాయని అధికారులు చెప్తున్నారు.