వాహనాలకు సంబంధించి కేంద్రం కీలక ఉత్తర్వులు

-

కారు, ఇతర వాహనాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అదేమంటే డ్రైవర్‌ పక్కన కూర్చునే ప్యాసింజర్‌ సీటుకూ ఎయిర్‌ బ్యాగ్‌ను తప్పనిసరి చేసినట్లు కేంద్ర రవాణా శాఖ తాజాగా ప్రకటించింది. ఈ మేరకు ఒక గెజిట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసినట్లు పేర్కొంది. కొత్త మోడళ్ల తయారీకి ఏప్రిల్‌ 1 నుంచి అలానే ప్రస్తుత మోడళ్లకు ఆగస్టు 31 నుంచి ఈ రూల్ అమలు కానున్నట్టు కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ విడుదల చేసింది.

నిజానికి గ‌త డిసెంబ‌ర్‌ లోనే కార్ల‌లో ముందు రెండు సీట్ల‌కు త‌ప్ప‌నిస‌రి చేయాలా? వ‌ద్దా? అన్న విష‌యం మీద కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణ జ‌రిపింది. ఆ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు అన్ని కార్ల‌లో డ్రైవ‌ర్ సీటుకు మాత్ర‌మే ఎయిర్‌బ్యాగ్ ఉండేది. ఇప్పుడు రెండు సీట్లకు ఖచ్చితంగా ఎయిర్ బ్యాగ్ ఉండాలనే నిబంధన తప్పని సరి చేశారు.  

Read more RELATED
Recommended to you

Latest news