ఆడవాళ్ళు దేనిలోనూ తక్కువ కాదు. ఈ మధ్యకాలంలో ఆడవాళ్ళు కూడా వాళ్ళ యొక్క కలల్ని కూడా నెరవేర్చుకుంటున్నారు. ఇది వరకు కంటే కూడా ఆడవాళ్లు సొసైటీలో ఎంతో ముందు ఉంటున్నారు. అనుకున్న వాటిని పక్కన పెట్టకుండా సాధిస్తున్నారు. నిజంగా ఈమెని చాలా మంది గృహిణులు ఆదర్శంగా తీసుకోవాలి అయితే ఈమె ఒక గృహిణి అయి ఉండి ఇప్పుడు ఈవెంట్ మేనేజర్ కింద మారారు. మరి ఆమె గురించి ఇప్పుడు చూద్దాం.
ఈమె కష్టపడే తత్వం కలవారు. అలానే ఈమెకి క్రియేటివిటీ చాలా ఎక్కువ. నిజానికి ఆమెలో ఉండే ఈ గుణాలే సక్సెస్ ఫుల్ మహిళ గా మార్చింది. ఒక మంచి భార్యగా, తల్లిగా ఉంటూ ఈమె తన బిజినెస్ లో సక్సెస్ సాధించారు. ఈమె పేరు అల్కా జాజూ. ఈమె మార్వాడీ కుటుంబానికి చెందిన ఆమె. మొదట ఈమె గిఫ్ట్ ప్యాకింగ్ మరియు చిన్నచిన్న పార్టీలకి ఈవెంట్ల కి కావాల్సిన ప్రాప్స్ వంటివి తయారు చేసేవారు.
ఈమెకి మంచి మంచి ఐడియాస్ రావడం వల్లనే క్రియేటివిటీని ఉపయోగించడం జరిగింది. హౌస్ డెకరేషన్ చేయడం చిన్న చిన్న పార్టీలని ఆర్గనైజ్ చేయడం లాంటివి చేస్తూ ఉండేవారు. అలానే ఎంతో అందంగా ఏ ప్రదేశంని అయినా క్రియేటివిటీతో మార్చేవారు.
ఇలా ఆమె కష్ట పడుతూ ఇంత ఎత్తుకు ఎదిగారు. నిజానికి మహిళలు కి గౌరవం ఇవ్వాలి. ఇలా మహిళలకు గౌరవం ఇస్తున్న ప్రపంచంలో ఉన్నందుకు ఆనందంగా ఉందని ఆమె తెలిపారు. నిజానికి స్త్రీలు ఇంట్లోనే ఉండాలి. పురుషులు మాత్రమే పని చేయాలి అనేది ఈ రోజులలో లేవు. పైగా చేసే పనిని ప్రేమించి చేస్తే ఎవరైనా సరే సక్సెస్ అవ్వగలరు అని రుజువు చేశారు.
అయితే చేసే పనిని ఆమె ఎంతో చక్కగా ఎంజాయ్ చేస్తారు. ఈమెకి ఈ ఏడాది మహేశ్వరి మహిళా మండల్ తరఫు నుంచి అవార్డు కూడా వచ్చింది. ఈమె ని స్ఫూర్తిగా తీసుకుంటే గృహిణిలు మంచిగా సక్సెస్ అవ్వగలరు.