ఆయుర్వేదంలో అత్యంత ప్రధాన్యం ఉన్న మూలికల్లో శతావరి ఒకటి. రోగనిరోధక శక్తిని పెంచడం నుండి తల్లులయిన మహిళల్లో పాల ఉత్పత్తిని పెంచడానికి, ప్రత్యుత్పత్తి హార్మోన్ల విషయంలో ఇది ఉపయోగపడుతుంది. అందుకే దీన్ని మహిళలకు మంచి స్నేహితురాలిగా చెబుతారు. ప్రస్తుతం ఈ శతావరి చేసే మేలు గురించి తెలుసుకుందాం.
అసలు దీని రుచి ఎలా ఉంటుంది?
ఇది కొంచెం తియ్యగా, చేదుగా ఉంటుంది. వాత పిత్త దోషాలను దూరం చేయడంలో ఇది బాగా సాయపడుతుంది. దీని అనేక లక్షణాల్లో అత్యంత ప్రభావమైనది ఏదైనా ఉందంటే, పునరుత్తేజం చేయడమే. శతావరి కారణంగా కొత్త ఉత్సాహం వస్తుంది.
దీనివల్ల కలిగే లాభాలు
పీఎమ్ఎస్ లక్షణాలను తగ్గిస్తుంది. రుతుక్రమ సమయంలో రక్తప్రసరణను సాధారణంగా ఉంచుతుంది. సంతాన సాఫల్యతను పెంచడంతో పాటు తల్లులకు పాల ఉత్పత్తిని పెంచుతుంది. తల్లుల్లో పాల ఉత్పత్తిని పెంచే అనేక మూలికల్లో శతావరి ప్రధానంగా ఉంటుంది. అంతే కాదు దీనివల్ల పాపకి ఎంతో మేలు కలుగుతుంది.
రుతుక్రమ సమయంలో కలిగే మూడ్ మార్పులను ఇది తగ్గిస్తుంది. చిరాకు, కోపాన్ని తగ్గించి శాంతపరుస్తుంది. కండల పెరుగుదలకు ఇది సాయపడుతుంది.
జీర్ణక్రియ పనితీరును మెరుగుపరుస్తుంది. రక్తం కారిపోవడాన్ని నివారిస్తుంది.
శతావరిని ఎలా తీసుకోవాలి?
పాలతోపాటు శతావరిని తీసుకోవాలి. గ్లాసెడు పాలలో అర టీ స్పూన్ శతావరి కలుపుకుని సేవిస్తే సరిపోతుంది.
పురుషులకు ఎలా ఉపయోగపడుతుంది?
శతావరి సేవనం వల్ల పురుషుల్లో వీర్యం నాణ్యత పెరుగుతుంది. సంతాన సాఫల్యతలో వైద్యులు దీన్ని ప్రముఖంగా చర్చిస్తారు.