సెంచరీ కొట్టనున్న పెట్రోల్ ధర.. సరికొత్త రికార్డుకు చేరువలో..!

-

క్రికెట్ ఆటలో సెంచరీకి ఉన్న ప్రాధాన్యమే వేరు. ఎవరైనా ఆటగాడు సెంచరీ కొడితే బ్యాట్ పైకి లేపుతాడు. దేనికి.. తన విజయానికి సూచికగా. మరి.. పెట్రోల్ ధర కూడా సెంచరీకి చేరువకానున్నది కదా. పెట్రోల్ ధర సెంచరీకి చేరువయ్యాక.. వాహనదారులు ఏం చేయాలి. తమ వాహనాన్ని లేపి చూపించాలా? ఏమో.. ఇది మాత్రం కన్ఫ్యూజింగే.

గత కొన్ని రోజుల నుంచి పెట్రోల్ ధరలు అలా అలా పెరుగుతూ పోతూనే ఉన్నాయి. కానీ తగ్గడం లేదు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు విపరీతంగా పెరిగిపోవడమే ఈ ధరల పెరుగుదలకు కారణం అంటూ కేంద్ర ప్రభుత్వం గగ్గోలు పెడుతోంది. ముడి చమురు ధరలు కూడా పెరిగిపోయి ఆల్ టైమ్ రికార్డును సృష్టిస్తున్నాయి. దీంతో పెట్రోల్ ధర కూడా కొన్ని రోజుల్లో సెంచరీ మార్కును అందుకోనుంది. ఇవాళ(శనివారం) హైదరాబాద్ లో పెట్రోల్ ధర 85.23 రూపాయలు ఉండగా.. డీజిల్ ధర 78.87 రూపాయలుగా ఉంది.

ఇక ముంబైలో రికార్డు స్థాయిలో 87.39 రూపాయలకు చేరుకొన్నది. ఇవాళోరేపో 90 రూపాయలు కూడా దాటే అవకాశం ఉంది. మరికొన్న రోజుల్లో సెంచరీ కొట్టడం ఖాయం అంటూ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒక్క ముంబై మాత్రమే కాదు.. ఢిల్లీలో 79.99 రూపాయలు, ఇతర రాష్ట్రాల్లోనూ 80 ని దాటేసింది. చెన్నైలో రూ. 82 గా ఉంది.

పెట్రోల్ తో పాటు డీజిల్ ధరలు కూడా దేశవ్యాప్తంగా భగ్గుమంటున్నాయి. ఢిల్లీలో డీజిల్ ధర 72.07 ఉంది. ముంబైలో 75 మార్క్ ను దాటేసింది.

Read more RELATED
Recommended to you

Latest news