అత్యంత రహస్యంగా, పకడ్బందీ ప్రణాళికతో చేపట్టిన జమ్ముకశ్మీర్ బిల్లు రూపకల్పనలో ఓ తెలుగు అధికారి కీలక పాత్రపోషించారు. రాజ్యసభలో చరిత్రాత్మక బిల్లులతో మోదీ సర్కార్ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆర్టికల్ 370 రద్దు, కశ్మీర్ రెండుగా విభజన తదితర నాలుగు బిల్లులను కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలో సోమవారం ప్రవేశపెట్టారు.
అత్యంత రహస్యంగా, పకడ్బందీ ప్రణాళికతో చేపట్టిన ఈ బిల్లు రూపకల్పనలో ఓ తెలుగు అధికారి కీలక పాత్రపోషించారు. శాసన వ్యవహారాల శాఖ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ జి.నారాయణరాజు గెజిట్ రూపకల్పనలో పాలుపంచుకున్నారు. సీనియర్ లీగల్ సర్వీస్ ఆఫీసర్ అయిన నారాయణ రాజు.. 2015లో లెజిస్లేటీవ్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి ఆయనే చట్టాలు రూపొందిస్తున్నారు.
– కేశవ