గద్దర్‌కు ఎల్టీటీఈ తీవ్రవాదికి తేడా లేదు : బీజేపీ నేత విష్ణువర్ధన్

-

ప్రజాగాయకుడు గద్దర్ కు ఎల్టీటీఈ తీవ్రవాదికి పెద్దగా తేడా ఏమీలేదని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు.పద్మ అవార్డుల విషయంలో తెలంగాణ కళాకారులకు అన్యాయం జరిగిందని సీఎం రేవంత్ అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మంగళవారం దానికి కౌంటర్‌గా ఢిల్లీలో బీజేపీనేత విష్ణువర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. గద్దర్‌కు ఎల్టీటీఈ తీవ్రవాదికి పెద్దగా తేడా ఏమీ లేదన్నారు.

అనేక మంది ప్రాణాలు తీసిన నరహంతకుడు గద్దర్ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.భారత ప్రజాస్వామ్య విధానాలకు గద్దర్ బద్ధ వ్యతిరేకి అని మండిపడ్డారు.నిషేధిత మావోయిస్టు సంస్థలో ఉన్న గద్దర్‌కు అవార్డు ఎలా ఇవ్వాలని ప్రశ్నించారు.ఎల్టీటీఈకి కూడా పద్మ అవార్డులు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అంటారా? అని ప్రశ్నించారు. లేక ఆయన కూతురు కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నారని పురస్కారం ఇవ్వాలా? అని సెటైర్లు వేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ గద్దర్‌పై అనేక కేసులు ఉన్నాయనే విషయాన్ని విష్ణువర్ధన్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తుచేశారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version