Gajwel : యాక్సిడెంట్‌లో ఇద్దరు కానిస్టేబుళ్ల మృతి.. మాజీ మంత్రి హరీశ్ రావు దిగ్భ్రాంతి!

-

సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ పట్టణంలోని జాలిగామ బైపాస్‌లో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు అక్కడికక్కడే దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. రాయపోలు పోలీస్‌స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న పరందాములు, దౌల్తాబాద్‌‌‌లో పనిచేసే వెంకటేశ్‌ ఇద్దరు మృతి చెందినట్లు పోలీసులు పేర్కొన్నారు. హైదరాబాద్‌లో జరిగే మారథాన్‌లో పాల్గొనేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ ప్రమాదంపై తాజాగా బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. కానిస్టేబుళ్ల మృతి దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం ప్రకటించారు. కానిస్టేబుళ్ల కుటుంబాలను ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఇదిలాఉండగా, ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ప్రకటించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version