ఏపీ పేదలకు షాక్…పింఛన్లపై చంద్రబాబు నాయుడు సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. రేపు, ఎల్లుండి పింఛన్ల తనిఖీ చేయనుంది చంద్రబాబు నాయుడు సర్కార్. ఇవాల్టి నుంచి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల తనిఖీని చేపట్టనుంది చంద్రబాబు నాయుడు సర్కారు. ముఖ్యంగా వికలాంగులు అలాగే ఇతర కేటగిరలో అనర్హులు లబ్ధి పొందుతున్నారని అనేక ఫిర్యాదులు వచ్చాయని సమాచారం. ఈ నేపథ్యంలోనే… తప్పుడు పత్రాలతో లబ్ధి పొందుతున్న వారిని ఏరి వేయనున్నారు.
తొలి విడతలో ఒక్కో గ్రామ అలాగే వార్డు సచివాలయ పరిధిలో ఉన్న లబ్ధిదారుల ఇండ్లకు… వెళ్లి దివ్యాంగులు అలాగే ఇతర కేటగిరీలో ఉన్న అనర్హుల లిస్టును… వెలికి తీయని ఉంది చంద్రబాబు సర్కార్. ఇవాళ అలాగే రేపు ఈ ప్రక్రియ కొనసాగనుంది. దీనికోసం పక్కా మండలానికి సంబంధించిన సిబ్బందిని కూడా నియమించనుంది. ఒక బృందానికి 40 పింఛన్ల ను పరిశీలించేలా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే పెన్షన్ల ఏరివేత కార్యక్రమం చేపట్టిన నేపథ్యంలో… ఏపీ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.